News

జీఎస్టీతో బిల్లు చూస్తారా..?


పై ఫొటో చూశారా..! ఇదేనండీ జీఎస్టీతో కూడిన మన కొత్త బిల్లు. ఒకే దేశం ఒకే పన్ను నినాదం కింద వస్తు సేవల పన్ను(జీఎస్టీ)నేటి నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొత్త పన్నులతో బిల్లులు ఎలా ఉంటాయో ప్రజలకు చెప్పేందుకు జీఎస్టీ కౌన్సిల్‌ తమ ట్విటర్‌ ఖాతాలో ఓ హ్యాష్‌ట్యాగ్‌ను ఏర్పాటుచేసింది.trystwithGST పేరుతో ఉన్న ఈ హ్యాష్‌ట్యాగ్‌తో వినియోగదారులు తమతమ కొత్త జీఎస్టీ బిల్లులను పోస్టు చేయాలని కోరింది. దీంతో పలువురు నెటిజన్లు తమ కొత్త బిల్లులను ట్వీట్‌ చేశారు. వీటిని జీఎస్టీ కౌన్సిల్‌ రీట్వీట్‌ చేస్తోంది.


జీఎస్టీకి ముందు.. జీఎస్టీ తర్వాత 


కాగా.. జీఎస్టీపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యక్తి జీఎస్టీ వల్ల తన ఆహార బిల్లులో ఎంత తేడా వచ్చిందో చూపిస్తూ.. జూన్‌ 30, జులై 1 నాటి బిల్లులను పోస్టు చేశారు. అందులో జూన్‌ 30న తాను